Medchal: మేడ్చల్ గుబ్బ కోల్డ్ స్టోరేజ్‌లో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట గుబ్బ కోల్డ్ స్టోరేజ్‌లో ఫ్యూజ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి బెస్త నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 7 Aug 2026 10:52 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ గుబ్బ కోల్డ్ స్టోరేజ్‌లో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట గుబ్బ కోల్డ్ స్టోరేజ్ లో విద్యుత్ షాక్ తగిలి బెస్త నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు.కోల్డ్ స్టోరేజ్ లో కరెంట్ పోయిందని కంపెనీ వాళ్ళు స్థానిక లైన్ మెన్ చారి ని ఫోన్ చేయడంతో అతను అందుబాటులో లేకపోవడం వల్ల కింది స్థాయి ఉద్యోగిని పంపించాడు.

తాను కంపెనీలో ఫ్యూజ్ వేసే క్రమంలో ఆటోమేటిక్ గా జనరేటర్ ఆన్ అవడంతో కరెంట్ షాక్ తగిలి ఒక్క సారిగా కుప్పకూలాడు.దీనితో హఠాత్తుగా కంపెనీ కార్మికులు చికిత్స నిమిత్తం మేడ్చల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యలు నిర్ధారించారు.

మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు బంధువులు తెలిపారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story