Hyderabad: వనస్థలిపురం బహిరంగ మద్యం సేవించినందుకు శిక్ష
Hyderabad: వనస్థలిపురంలో బహిరంగంగా మద్యం తాగుతూ మూడోసారి పట్టుబడిన యువకుడు. 5 రోజుల పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని కోర్టు తీర్పు. హెచ్చరించిన పోలీసులు.
Hyderabad: వనస్థలిపురం బహిరంగ మద్యం సేవించినందుకు శిక్ష
హైదరాబాద్: వనస్థలిపురంబహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినందుకు దోనూరు జయసింహా రెడ్డి కు 5 రోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఇదే విధంగా ఇంతకు ముందు రెండు సార్లు బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతూ పట్టుబడ్డాడు. అయినప్పటికీ మారకుండా మూడోసారి పట్టుబడడంతో కోర్టు కఠినంగా శిక్ష విధించింది. కమ్యూనిటీ సర్వీస్ కింద ట్రాఫిక్ రెగ్యులేషన్, వీధుల శుభ్రత వంటి సోషల్ సర్వీస్ పనులు చేయించనున్నారు.
ముద్దాయి వివరాలు:
పేరు: దోనూరు జయసింహా రెడ్డి
తండ్రి పేరు: జనార్దన్ రెడ్డి
వయస్సు: 24 సంవత్సరాలు
వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి
నివాసం: అరుణోదయ కాలనీ, భాగ్యలత, హయత్నగర్ ఈ సందర్భంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ కూడా మద్యం సేవించి చుట్టూ ఉన్న జనావాసాలకు ఇబ్బంది కలిగించవద్దని, ఒకవేళ అలా చేసినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




