Manchala: చెక్‌పోస్ట్ వద్ద దొరికిపోయిన చైన్ స్నాచర్!
Manchala: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో చైన్ స్నాచింగ్ నిందితుడు బాణాల హరిచంద్ర ప్రసాద్ పోలీసులకు చిక్కాడు.
Manchala: చెక్‌పోస్ట్ వద్ద దొరికిపోయిన చైన్ స్నాచర్!
మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించడం మంచాల మండలంలో పలు చైన్ స్నాచింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, దొంగిలించిన బంగారు పూసల తాడును స్వాధీనం చేసుకున్నారు.
వివరాలలోకి వెళితే, నిందితుడు బాణాల హరిచంద్ర ప్రసాద్ (19 సం॥), నివాసం చీమలగడ్డ, చందుపట్ల గ్రామం, నకిరేకల్ మండలం, నల్గొండ జిల్లా, తాను ఆర్థిక అవసరాలు మరియు మద్యం అలవాటు కారణంగా ఒంటరిగా ఉన్న మహిళలు మరియు వృద్ధ మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపిన మంచాల పోలీసులు అతని వద్ద నుండి సుమారు 30 గ్రాముల బరువున్న బంగారు పూసల తాడు మరియు పూసలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.




