Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో ఘోరం.. ఒకపక్క తాగునీటి కష్టాలు
Quthbullapur: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్‌లో గత కొద్దిరోజులుగా మంజీర తాగునీరు వృథాగా పోతోంది.
Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో ఘోరం.. ఒకపక్క తాగునీటి కష్టాలు
కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్ట డివిజన్ లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామీ ఆలయం దగ్గర యోగ పాఠశాల కాంపౌండ్ వాల్ ప్రక్కన గత కొద్ది రోజులుగా మంజీర నీరు. పైపులు పగిలిపోవడంతో వృధాగా పోతున్న త్రాగునీరు పట్టించుకోని అధికారులు, కొద్ది రోజులుగా లీకేజీ నీళ్లు పారుతూ ఉండడంతో పరుశురాం ఆలయం ప్రక్క నుంచి , సీత రామాంజనేయ టెంపుల్ ముందు నుండి పోలాల బస్తీ రోడ్ గుండా ప్రవహిస్తు ఉండడంతో ఆ ప్రాంతంలో పాకూరు గా పేరుకుపోవడం.
వలన పాదచారులు, మరియు ద్విచక్ర వాహనాలు జారీ పడి పోతున్నారని కానీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన ఎండాకాలం కావడంతో మంచినీరు దొరకలేని పరిస్థితి ఉండగా ఇక్కడ మాత్రం రోజూ మొత్తంలో ఎన్నో లీటర్ల మంచినీరు వృధాగా పోతున్న మంచినీటిని గమనించాలని అధికారులను కోరుతున్న కాలనీవాసులు.
Next Story




