Jubilee Hills: జూబ్లీహిల్స్ డివిజన్‌లో ‘సమస్యలపై సమరం’ పాదయాత్ర!
Jubilee Hills: జూబ్లీహిల్స్ డివిజన్ జవహర్ కాలనీ, ఇంద్రానగర్‌లో ‘సమస్యలపై సమరం’ పాదయాత్రలో మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొని డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను పరిశీలించారు.
Jubilee Hills: జూబ్లీహిల్స్ డివిజన్‌లో ‘సమస్యలపై సమరం’ పాదయాత్ర!
ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీ మరియు ఇంద్రానగర్ ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో ‘సమస్యలపై సమరం’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం పాదయాత్ర నిర్వహించారు.
ఈ పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.
స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు ఆయా కాలనీల్లో పర్యటించిన MGR గారు, జీహెచ్ఎంసీ డీసిల్టింగ్ పనులు సక్రమంగా జరగకపోవడం, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ ఛానల్ దెబ్బతినడం వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. అదేవిధంగా వీధి దీపాల కొరత కారణంగా ప్రజలు పడుతున్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శంకర్, బాబు, బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




