Khairatabad: సైఫాబాద్ కళాశాలలో ఘనంగా బంజారా తీజ్ పండుగ వేడుకలు
Khairatabad: చింతలబస్తీ డిగ్రీ కళాశాలలో బంజారా తీజ్ పండుగ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్‌ఎస్ పార్టీ ఖైరతాబాద్ ఇన్‌చార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి.
Khairatabad: సైఫాబాద్ కళాశాలలో ఘనంగా బంజారా తీజ్ పండుగ వేడుకలు
Khairatabad: తీజ్ పండుగ సందర్భంగా Degree& PG College చింతల బస్తీ సైఫాబాద్ పాల్గొన్న బీ ఆర్ ఎస్ పార్టీ ఖైరతాబాద్ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు. తీజ్ పండుగ బంజారా సమాజానికి ఎంతో ప్రత్యేకమైనది. ఇది మన సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యత మరియు ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీక. ముఖ్యంగా యువతులు తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ పండుగ ద్వారా మన పెద్దల నుంచి వచ్చిన ఆచారాలు, సంప్రదాయాలను తరువాతి తరాలకు అందించగలుగుతున్నాం.
మన సంస్కృతి మన గుర్తింపు. ఆధునిక కాలంలో ఎంత అభివృద్ధి చెందినా, మన మూలాలను మరియు సంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత చివరిగా, ఈ తీజ్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి మరియు విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్లు ప్రిన్సిపల్ కరుణాసాగర్ గారు, డాక్టర్ నరేందర్ పవర్, నవీన్ నాయక్, డాక్టర్ నరేష్, డాక్టర్ చంద్రశేఖర్ శంకర్, రామయ్య, జగన్, సుమంత్, బాబు తదితరులు పాల్గొన్నారు.




