Cantonment: కంటోన్మెంట్ బోర్డులో పక్షపాత పాలన.. మన్నె క్రిశాంక్ ఫైర్
Cantonment: కంటోన్మెంట్ బోర్డు బీజేపీ నామినేటెడ్ మెంబర్ భర్తకు చెందిన అక్రమ గెస్ట్ హౌస్‌పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
Cantonment: కంటోన్మెంట్ బోర్డులో పక్షపాత పాలన.. మన్నె క్రిశాంక్ ఫైర్
Cantonment: కంటోన్మెంట్ బోర్డు అధికారంలో సామాన్య ప్రజలకు ఓ న్యాయం పవర్ లో ఉన్న నామినేటెడ్ మెంబర్ కు ఓ న్యాయం ఉంటుందా అని కంటోన్మెంట్ బి ఆర్ ఎస్ సభ్యత్వ నమోదు ఇంచార్జ్, మాజీ మైనింగ్ ఛైర్మెన్ మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. తాడ్ బంద్ వద్ద కంటోన్మెంట్ బోర్డు బీజేపీ నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మద భర్త మల్లికార్జున్ పేరున ఇల్లిలీగల్ గా ఉన్న గెస్ట్ హౌజ్ కు కంటోన్మెంట్ బోర్డు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని క్రిశాంక్ ప్రశ్నించారు.
తాడ్ బంద్ సమీపంలో ఉన్న గెస్ట్ హౌజ్ ను బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి క్రిశాంక్ సందర్శించి మీడియా తో మాట్లాడారు కంటైన్మెంట్ బోర్డు పాలనలో సామాన్యులు తెలిసి తెలియక ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే వెంట వెంటనే నోటీసులు చర్యలు తీసుకునే అధికారులు మరి నామినేటెడ్ మెంబర్ కు సంబంధించిన ఇల్లిలీగల్ గెస్ట్ హౌజ్ పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
బోర్డు ప్రజా ప్రతినిధులు పాలన ముగిసి పది సంవత్సరాలు అయిపోయినా ఎన్నికలు జరుగకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని,ఇప్పటికైనా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరుపాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు




