Mansoorabad: సహారా ఎస్టేట్‌లో మంచినీటి వృథా జలమండలి నిర్లక్ష్యంపై ఆగ్రహం
Mansoorabad: మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ రోడ్డుపై గంటల తరబడి వృథాగా పారిన కృష్ణా జలాలు. స్పందించని జలమండలి అధికారులపై స్థానికులు, వాహనదారుల తీవ్ర ఆగ్రహం.
Mansoorabad: సహారా ఎస్టేట్‌లో మంచినీటి వృథా జలమండలి నిర్లక్ష్యంపై ఆగ్రహం
మన్సూరాబాద్: ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో విలువైన కృష్ణా జలాలు వృథాగా రోడ్డుపాలవుతున్నాయి. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సహారా ఎస్టేట్ ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
సుమారు గంటకు పైగా సమయం నుంచి పైపులైన్ నుంచి మంచినీరు పెద్దఎత్తున బయటకు వచ్చి రోడ్డుపై ప్రవహించింది. ప్రధాన రహదారి నుంచి కిందికి దాదాపు 500 మీటర్ల మేర నీరు పారుతూ వృథా అయింది. అయినా సంబంధిత జలమండలి అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల వద్ద మోటార్లు పెట్టి ర్యాంపులు, కార్లు, ఇళ్లను కడుగుతూ నీటిని వృథా చేస్తే జరిమానాలు విధించే జలమండలి.. ఇలా గంటల తరబడి వేల లీటర్ల మంచినీరు వృథా అవుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించే అధికారులు.. ముందుగా ప్రభుత్వ నీటి వనరుల వృథాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలకు నీటి పొదుపుపై పాఠాలు చెప్పే జలమండలి.. అధికారుల నిర్లక్ష్యంతో వృథా అవుతున్న నీటికి బాధ్యులెవరు? సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.




