Marpally: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!

Marpally: వికారాబాద్ జిల్లా మర్పల్లిలో హోటల్ భవనం పైకప్పు కూలిన ప్రమాదం.

MOGULAIAH, VIKARABAD
Published on: 6 Jun 2026 7:28 PM IST
Marpally
X

Marpally: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం!

మర్పల్లి: వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండల కేంద్రంలో హోటల్ భవనం పైకప్పు కూలిన ఘటనలో గాయపడిన నలుగురు బాధితులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ .

సంఘటన వివరాలు తెలియగానే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులను అప్రమత్తం చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించాలని ఆదేశించారు. హుటాహుటిన హైదరాబాద్ నుండి బయలుదేరి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ప్రవేటు హాస్పిటల్ లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్వయంగా పరామర్శించి, అవసరమైన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు.

సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందన (12), రమేష్ (25) లను స్పీకర్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ అనిల్ కుమార్, DMHO లలితా దేవి లను స్పీకర్ గారు ఆదేశించారు. అనంతరం గోకుల్ ప్రైవేట్ ఆసుపత్రి మరియు బాలాజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర బాధితులను కూడా స్పీకర్ పరామర్శించారు.

వారి ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్న సభాపతి ప్రసాద్ కుమార్ గారు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యాలను కోరారు. ఈ సందర్భంగా బాధితులు త్వరగా కోలుకోవాలని దైర్యం చెప్పిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మర్పల్లి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంట ఉన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story