Uppal: వరంగల్ హైవేపై దేశభక్తి హోరు.. బీజేపీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన!

Uppal: బీజేపీ ఆధ్వర్యంలో 240 అడుగుల భారీ జాతీయ జెండాతో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.

ASHOK, KAPRA
Published on: 14 Aug 2026 10:57 PM IST
Uppal
X

Uppal: వరంగల్ హైవేపై దేశభక్తి హోరు.. బీజేపీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన!

ఉప్పల్‌: ‘హర్‌ ఘర్‌ తిరంగ’ కార్యక్రమంతో ఉప్పల్‌లో దేశభక్తి ఉప్పొంగింది. 240 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఘనంగా దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఉప్పల్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు మార్నేని ఫణీంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ర్యాలీలో ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి నాయక్‌, సీనియర్‌ నాయకుడు గోనె శ్రీకాంత్‌ పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు కలిసి భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. 240 అడుగుల జాతీయ జెండా ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు ‘జైహింద్‌’, ‘వందేమాతరం’ నినాదాలతో ఉప్పల్‌ హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిను హోరెత్తించారు.

జాతీయ జెండాలతో సాగిన ర్యాలీ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బేతి సుభాష్‌రెడ్డి, మార్నేణి ఫణీంద్ర మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.

జాతీయ జెండా దేశ గౌరవం, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతను చాటుతూ సాగిన ఈ ర్యాలీలో ఉప్పల్‌ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story