Kukatpally: కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం!

Kukatpally: కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లోని ఇంక్ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Maruthisagar, Kukatpally
Published on: 8 Sept 2026 10:58 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం!

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఏబీసీ ప్రింటింగ్ ఇంక్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో పేలుడు శబ్దం కూడా వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story