Jawaharnagar: కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు.. స్కూల్ బ్యాగుల పంపిణీ
Jawaharnagar: జవహర్‌నగర్‌లో మాజీ మేయర్ కావ్య ఆధ్వర్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR 50వ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా విద్యార్థులకు బ్యాగులు పంచారు.
Jawaharnagar: కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు.. స్కూల్ బ్యాగుల పంపిణీ
మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసిన తొలి మేయర్ మేకల కావ్య...
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని జవహర్‌నగర్‌లో మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఎలాంటి అంగు ఆర్భాటాలకు వెళ్లకుండా,
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసి తారక రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు ఒకరికొకరు సీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన సేవలను నాయకులు కొనియాడారు.
విద్యకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని మాజీ మేయర్ మేకల కావ్య అన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని భగవంతుని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బైట్,,, మాజీ మేయర్ మేకల కావ్య జవహార్ నగర్...




