Vikarabad: ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించిన ఎంసిఆర్హెచ్ఆర్డిఐ శిక్షణార్థులు!

Vikarabad: హైదరాబాద్ MCRHRDI సంస్థకు చెందిన 178వ బ్యాచ్ అకౌంటెంట్ల వికారాబాద్ ట్రెజరీ కార్యాలయ అధ్యయన పర్యటన. అనంతరం అనంతగిరి హిల్స్ సందర్శన.

MOGULAIAH, VIKARABAD
Published on: 11 July 2026 1:03 PM IST
Vikarabad
X

Vikarabad: ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించిన ఎంసిఆర్హెచ్ఆర్డిఐ శిక్షణార్థులు!

Vikarabad: హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 178వ ఇండక్షన్ ట్రైనింగ్ బ్యాచ్‌కు చెందిన జూనియర్ మరియు సీనియర్ అకౌంటెంట్లు శుక్రవారం వికారాబాద్ జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఈ అధ్యయన పర్యటన జరిగింది.

కోర్స్ కోఆర్డినేటర్ రాధ కృష్ణా రావు (అసిస్టెంట్ లెక్చరర్) నేతృత్వంలో విచ్చేసిన ఈ శిక్షణా బృందానికి జిల్లా ట్రెజరీ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కార్యాలయంలో జరిగే రోజువారీ విధులు, అకౌంటింగ్ ప్రక్రియలు, ట్రెజరీ నిర్వహణ మరియు ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై శిక్షణార్థులకు అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.

విధి నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలను, సాంకేతికత వినియోగాన్ని వారికి వివరించారు.

మర్యాదపూర్వక విందు..

అనంతగిరి పర్యటన:

కార్యాలయ సందర్శన అనంతరం శిక్షణార్థులకు, కోఆర్డినేటర్‌కు జిల్లా ట్రెజరీ కార్యాలయ సిబ్బంది ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చి, వారితో కలిసి లంచ్ చేశారు.

అనంతరం శిక్షణార్థుల బృందం వికారాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్‌ను సందర్శించింది.

ప్రకృతి ఒడిలో కాసేపు గడిపి, అక్కడి విశేషాలను తెలుసుకున్నారు.

ఈ క్షేత్రస్థాయి పర్యటన తమకు ఎంతో జ్ఞానాన్ని, నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని శిక్షణార్థులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ కార్యాలయ అధికారులు, డిటిఒ వి. శ్రీదేవి ఆర్.వెంకట రమణ, ఏటిఓ, యస్టిఓ లు చెన్నయ్య, దేవేందర్, నిశాంత్, దిలీప్ మరియు ట్రైనీలు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story