Medak: శాసనసభ రద్దవుతుందనే భయంతోనే సమావేశాలు శేరి సుభాష్ రెడ్డి!

Medak: శాసనసభ రద్దవుతుందనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహిస్తోందని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆరోపించారు.

NAGARAJ, MEDAK
Updated on: 9 Sept 2026 1:08 PM IST
Medak
X

Medak: శాసనసభ రద్దవుతుందనే భయంతోనే సమావేశాలు: శేరి సుభాష్ రెడ్డి!

Medak: ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 09 :- ఎమ్మెల్సీల సమావేశాలు భారత రాజ్యాంగం ఆర్టికల్ 174 ప్రకారం ఆరు నెలలకు ఒకసారి గవర్నర్ సభను సమావేశ పరచాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇష్టాన్ని విధముగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రశ్నించే గొంతులను అంచు వేయడమే పనిగా పెట్టుకుని ఎమ్మెల్సీలను పై కేసులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సమావేశం చివరిరోజు నుండి తదుపరి సమావేశం మొదటి రోజు మధ్య ఆరు నెలల గడువు మించకూడదు. అంటే ఏడాదికి రెండు సార్లు తప్పక సమావేశాలు జరపాలి. సమావేశాల్లో నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయన తెలిపారు.

70 మందికి మించి సభ్యులు ఉన్న శాసనసభలు కనీసం ఏడాదికి 90 రోజులు సమావేశాలు నిర్వహించాలని వెంకటాచలయ్య కమీషన్ సిఫార్సు చేసింది. అయితే ఇది తప్పనిసరి కాదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో 2024లో 24 రోజులు, 2025లో 16 రోజులు, 2026 బడ్జెట్ సమావేశాలు 10 రోజులు నడిచాయి.

మొత్తంగా సభ నడిచింది 50 రోజులు మాత్రమే.ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలంగాణ శాసనసభ వర్షాకాలం సమావేశాలు ఏర్పాటు చేశారు. వాటిని సోమవారం నుండి శనివారం వరకు అంటే ఆరు రోజులు నడపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

కేవలం సమావేశాలు ఏర్పాటు చేయనట్లయితే శాసనసభ రద్దయ్యే అవకాశం ఉందని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ సమావేశాలు నిర్వహిస్తుంది. కానీ సభ సజావుగా సాగితే ప్రతిపక్షం సమస్యల మీద నిలదీస్తే అధికారికంగా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది.

అందుకే తొలిరోజే పోలీసులను ఉసిగొల్పి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీద దాడులు చేయించి డైవర్షన్ గేమ్ షురూ చేసింది. రెండో రోజు ఏకంగా ప్రభుత్వమే తమ ఎమ్మెల్యేలను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీదకు దాడులకు పంపి రెండో రోజూ ప్రజల సమస్యలు శాసనసభలో చర్చకు రాకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు.

శాసనసభలో ప్రధానంగా 22ఎ నిషేధిత భూముల వ్యవహారం, ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, మూసీ సుందరీకరణ, రైతుబీమా నిలిపివేత, రైతుభరోసా నిధుల విడుదల, సాగునీళ్లు, కరెంటు కోతలు, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ, పెన్షనర్లకు బకాయిల చెల్లింపు, ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం, ప్రభుత్వ లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలు ఉన్నాయి.

వీటితోపాటు ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల అక్రమాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం సభలో ఉంటే వీటిపై నిలదీస్తుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్భంధం, అక్రమ కేసులు, అరెస్టులతో సభను జరగకుండా ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సభను సాగనివ్వడం లేదని బీజేపీ ఆరోపిస్తున్నది.

అయితే సభ బయట సోమవారం బీఆర్ఎస్ నేతల మీద దాడి జరిగింది. సభలోపల ఉన్న బీజేపీ 22 ఎ నిషేధిత భూముల మీద విచారణ కోరింది. సభ 15 నిమిషాలు వాయిదా అని చెప్పి మధ్యాహ్నం 2 గంటలకు సమావేశపరిచారు.

బీజేపీ సభలో ఉండి ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలపై నిలదీయకుండా సభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయింది. మంగళవారం అదే డిమాండ్ లేవదీసిన బీజేపీ చర్చ పెట్టలేదని మళ్లీ వాకౌట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి లోపాయికారిగా బీజేపీ సహకరిస్తుందని దీనిని బట్టి అర్థమవుతోంది.

ప్రస్తుతం ఇక సభకు మిగిలింది నాలుగు రోజులు మాత్రమే. తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించి పారిపోయే ప్రయత్నంలో ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అందుకే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని సభలోకి రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అంచు వేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ఆయన తెలిపారు

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story