Medchal: ఘనంగా సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం: రాజీలేని పోరాటాలతో కార్మికుల పక్షాన నిలిచే ఏకైక శక్తి - జిల్లా నేత చింతకింది అశోక్!

Medchal: మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్‌లో సిఐటియు (CITU) 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐదు దశాబ్దాలుగా కార్మికుల పక్షాన నిలిచిన ఏకైక శక్తి సీఐటీయూ అని జిల్లా అధ్యక్షులు చింతకింది అశోక్ కొనియాడారు.

PURENDAR, ALWAL
Published on: 30 May 2026 7:38 PM IST
Medchal
X

Medchal: ఘనంగా సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం: రాజీలేని పోరాటాలతో కార్మికుల పక్షాన నిలిచే ఏకైక శక్తి - జిల్లా నేత చింతకింది అశోక్!

అల్వాల్ (మేడ్చల్ జిల్లా): ఐదు దశాబ్దాలకు పైగా రాజి లేని పోరాటాలతో కార్మికుల పక్షాన నిలిచిన ఏకైక శక్తి సీఐటీయూ అని మేడ్చల్ జిల్లా భవన నిర్మాణ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతకింది అశోక్ అన్నారు. శనివారం బాలాజీ నగర్ లో సీఐటీయూ 56 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా లేబర్ అడ్డా వద్ద కాప్రా సర్కిల్ భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షులు దావత్ నాగేష్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ 1970 మే 30న ఏర్పాటైన సిఐటియు నేడు 56 వ వసంతంలోకి అడుగు పెట్టిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది శ్రామికులకు అండగా నిలుస్తూ వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. కార్మికులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం చంద్రశేఖర్, ఉపాధ్యాయులు బలరాం కుమార్, రాజు, బాబు, తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story