Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేపీ నిరసన దీక్ష

Hyderabad: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐడీపీఎల్ చౌరస్తాలో బీజేపీ నాయకుల నిరసన దీక్ష. కొల్లి మాధవి మద్దతు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 31 Aug 2026 11:39 PM IST
Hyderabad
X

Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేపీ నిరసన దీక్ష

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం IDPL చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, మరియు బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు.

దీక్ష అనంతరం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి, నిమ్మరసం తాగించి దీక్షను విరమింప చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, నందనం దివాకర్, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు శేఖర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు గరిగే శేఖర్, ప్రగతి నగర్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, సుబ్బారావు,

బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ శివాజీ, మాధురి, పత్తి రఘుపతి, సదానందం, కట్ట కుమార్, మహేష్, 283 డివిజన్ బిజెపి నాయకులు వేణుగోపాల్, రామచంద్ర రావు, 281 డివిజన్ బిజెపి నాయకులుగోపాల్, చంద్రప్రకాష్, శివ, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story