Medchal: మేడ్చల్ అత్వెల్లి వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడిన కారు

Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్వెల్లి వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 26 Aug 2026 11:26 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ అత్వెల్లి వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడిన కారు

మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై అత్వెల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే రహదారిపై కారు బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కారు ఎలా బోల్తా పడిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కారులో ఒక్కరే ఉన్నట్లు సమాచారం. ఎలాంటి గాయాలు కాకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story