Medchal: మేడ్చల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Medchal: మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 19 Aug 2026 4:22 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

మేడ్చల్: మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ముఖ్యంగా 22Aకి సంబంధించిన రిజిస్ట్రేషన్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

22Aకి సంబంధించిన పెండింగ్ రిజిస్ట్రేషన్లు, వాటి పరిష్కారానికి ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యలు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న ఇతర రిజిస్ట్రేషన్ల వివరాలను కూడా అడిగి తెలుసుకున్న కలెక్టర్, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story