Boduppal: బోడుప్పల్ రా చెరువుపై హైడ్రా ఫోకస్? రంగంలోకి కాంగ్రెస్ నేతలు!
Boduppal: మేడ్చల్ నియోజకవర్గంలోని చెరువుల పరిరక్షణ, సుందరీకరణ కోసం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కలిశారు.
Boduppal: బోడుప్పల్ రా చెరువుపై హైడ్రా ఫోకస్? రంగంలోకి కాంగ్రెస్ నేతలు!
బోడుప్పల్: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చెరువుల సుందరీకరణ, పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి సహకరించాలని కోరుతూ మంగళవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని చెరువులు ఆక్రమణలు, కాలుష్య సమస్యలతో తమ అసలు రూపాన్ని కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బోడుప్పల్ లోని రా చెరువు, పీర్జాదిగూడలోని పెద్ద చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి బండ్ లుగా తీర్చిదిద్దాలని కోరారు. అలాగే చెంగిచెర్ల చింతల చెరువును సుందరీకరించి, కలుషిత జలాలు చెరువులోకి చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చెరువుల పరిరక్షణతో భూగర్భ జలాల స్థాయి పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్‌ను కలిసిన వారిలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్ల అధ్యక్షుడు తుంగతుర్తి రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాయిపేట శ్రీనివాస్ యాదవ్, , మాజీ కార్పొరేటర్ బొమ్మకు కళ్యాణ్, ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




