Medchal: మేడ్చల్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా

Medchal: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ మేడ్చల్ గాంధీ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శాంతియుత నిరసన.

NAKSHATRAM, MEDCHAL
Published on: 22 July 2026 1:23 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా

Medchal: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన నిరసన నిర్వహించారు.నీట్ పేపర్ లీక్ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు…

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజగిరి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story