Medchal: మేడ్చల్ జిల్లా పూడూరులో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు!

Medchal: మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 298వ డివిజన్ పూడూరులో కార్తీక పౌర్ణమి వేడుకలు, జ్వాలా తోరణం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి.

NAKSHATRAM, MEDCHAL
Published on: 25 Nov 2026 8:13 AM IST
Medchal
X

Medchal: మేడ్చల్ జిల్లా పూడూరులో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు!

మేడ్చల్: మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 298వ డివిజన్ పూడూరులో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జ్వాలా తోరణం వెలుగుల్లో భక్తులు భక్తిపారవశ్యంతో వేడుకల్లో పాల్గొన్నారు. భక్తుల పూజలు, దీపారాధనలు, జ్వాలా తోరణంతో పూడూరులో పండుగ వాతావరణం నెలకొంది.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL