Medchal: మేడ్చల్ కోర్టులో పర్యావరణ దినోత్సవం జడ్జిల ఆధ్వర్యంలో 3K వాక్
Medchal: ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోర్టులో 3కే వాక్, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
Medchal: మేడ్చల్ కోర్టులో పర్యావరణ దినోత్సవం జడ్జిల ఆధ్వర్యంలో 3K వాక్
మేడ్చల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శుక్రవారం మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 3కె వాక్ నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క అధికారిక థీమ్ "ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం.. మన భవిష్యత్తు కోసం" అంటూ కోర్టు ఆవరణలో వివిధ రకాలైన మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతను న్యాయమూర్తులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పర్యావరణ హిత జీవనశైలి, ప్రకృతి సంరక్షణ, కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సట్టు రవీందర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి. రత్నయ్యతో పాటు పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.




