Medchal: పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష!
Medchal: జవహర్‌నగర్ పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు తీర్పు రూ.3 వేల జరిమానా, బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం.
Medchal: పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష!
మేడ్చల్: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మేడ్చల్ జిల్లా రేప్, పోక్సో కేసుల ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. 2019లో క్రైం నంబర్ 383/2019లో ఐపీసీ 354, పోక్సో చట్టంలోని సెక్షన్ 12 కింద కేసు నమోదైంది. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడు జొరిల్ల వెంకటయ్య (55)కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.50 వేల పరిహారం అందించాలని ఆదేశించింది.
కేసు దర్యాప్తు అధికారిగా ఎస్‌ఐ ఎస్. సైదులు వ్యవహరించారు. ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక పీపీ జి. ప్రభాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీడీవోగా ఎం. శ్రీధర్‌చారి, సమన్ల బాధ్యతల్లో గణేష్, లైజన్ అధికారిగా ఏఎస్సై కె. కోటేశ్వరి, మానిటరింగ్ అధికారిగా ఏఎస్సై పి. నరసింహారెడ్డి వ్యవహరించారు.




