Medchal: జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు!
Medchal: జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారుల వేషధారణలు, ఉట్టి కొట్టే కార్యక్రమం ఆకట్టుకున్నాయి.
Medchal: జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు!
Medchal: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటేశ్వర్ నగర్ డివిజన్‌లోని వెంకటేశ్వర్ నగర్ కాలనీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.వెంకటేశ్వర్ నగర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, సత్యభామ వేషధారణలో పాల్గొని నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల వేషధారణలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో కాలనీ పెద్దలు ఎర్ర లక్ష్మయ్య, పల్లపు బాబు, బొమ్మ శ్రీధర్, రాంబాబు, యాదగిరి, భీమయ్య, శ్రీనివాస్, చందు,అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




