Medchal: మేడ్చల్‌లో బ్లాస్టింగ్ కలకలం – భయాందోళనలో స్థానిక ప్రజలు

Medchal: మేడ్చల్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బ్లాస్టింగ్‌తో భారీ రాళ్లు షాపుపై పడ్డాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 30 Sept 2026 8:07 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్‌లో బ్లాస్టింగ్ కలకలం – భయాందోళనలో స్థానిక ప్రజలు

మేడ్చల్‌: మేడ్చల్‌ నుంచి గిర్మాపూర్‌ వెళ్లే దారిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక వైపు బ్లాస్టింగ్‌. బ్లాస్టింగ్‌ ప్రాంతం నుంచి రోడ్డుకు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉండటంతో స్థానికులు బయందోళన.

బ్లాస్టింగ్‌ ధాటికి భారీ రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న రామ్ ఎంటర్‌ప్రైజెస్‌ షాపులో పడడంతో ఆస్తి నష్టం. రాత్రి వేళల్లో బ్లాస్టింగ్ చేయడం వల్ల షాప్ లో ఎవరు లేకపోవడం తో తప్పిన ప్రాణనష్టం.

నిత్యం జనసంచారం ఉండే ప్రాంతం కావడంతో బ్లాస్టింగ్‌ కొనసాగితే ప్రజల ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికుల ఆందోళన..

నాగరాజు అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL