Keesara: చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తజనం!
Keesara: కార్తీక పౌర్ణమి సందర్భంగా కీసర మండలం చీర్యాల శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరుగుతున్నాయి.
Keesara: చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తజనం!
కీసర: కార్తీక పౌర్ణమి సందర్భంగా కీసర మండలం చీర్యాలలోని శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో ఈ వ్రతంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సప్త వృక్షాల దగ్గర కార్తీకదీపంలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు .
ఉదయం నుంచే శివాలయంలో పంచామృత అభిషేకాలు భారీ ఎత్తున జరిగాయి, కార్తిక పౌర్ణమి అఖండ జ్యోతి ని ఆలయ ఫౌండర్ & చైర్మన్ మల్లారపు లక్ష్మీ నారాయణ సాయంత్రం 6 గంటలకి వెలిగించడం జరుగుతుంది . భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి సౌకర్యం, కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి సౌకర్యం పార్కింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది.




