Medchal: పూడూర్‌లో ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ.. పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

Medchal: పూడూర్‌లో మండల వెంకటేశ్‌ గౌడ్‌ 18వ అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా జరిగింది. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 29 Nov 2026 9:43 PM IST
Medchal
X

Medchal: పూడూర్‌లో ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ.. పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

మేడ్చల్: పూడూర్‌–కిష్టాపూర్‌ డివిజన్‌ పరిధి పూడూర్‌ గ్రామంలో అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా జరిగింది.మండల వెంకటేశ్‌ గౌడ్‌ గురుస్వామి 18వ మహాపడి పూజ సందర్భంగా గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద వేదపండితులు వెంకటేశ్‌శర్మ, కార్తీక్‌ ల ఆద్వర్యంలో మణికంఠుడికి అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వాములు 18వ ఏటా శబరియాత్ర చేయనున్న వెంకటేశ్‌ గురుస్వామికి నారికేళమొక్క, బెత్తాన్ని పూజలు చేసి అందజేశారు.

అనంతరం 18 మెట్లపై మహాపడిని కుమారుడు పరమేశ్‌ స్వామితో కలిసి వెలిగించారు. పడిపూజలో వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున అయ్యప్పస్వాములు, గ్రామస్తులు పాల్గొనగా గ్రామం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. పాల్గొన్న ఎంపీ,ఎమ్మెల్యే.

పూడూర్‌లో జరిగిన మహాపడిపూజలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు నాయకులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమలో గురుస్వాములు మాదవచారి,శ్రీనివాస్ గౌడ్, సురేశ్‌గౌడ్,రాములు, శశికుమార్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL