Medchal: లోక్ అదాలత్ ద్వారా ఉచిత, వేగవంతమైన న్యాయం జడ్జి బాల భాస్కర్!
Medchal: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌లో 51 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి.
Medchal: లోక్ అదాలత్ ద్వారా ఉచిత, వేగవంతమైన న్యాయం జడ్జి బాల భాస్కర్!
మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌లో మొత్తం 51 కేసులను పరిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి. బాల భాస్కర్ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు లోక్ అదాలత్‌ల ద్వారా వేగవంతమైన, ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పెషల్ లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 48 చెక్కు బౌన్స్ కేసులు, 3 బ్యాంకు ప్రీ-లిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.




