Medchal: మేడ్చల్‌లో రోల్డ్ గోల్డ్ గొలుసు దొంగలు అరెస్ట్

Medchal: మేడ్చల్‌లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు. రోల్డ్ గోల్డ్ గొలుసు దొంగిలించిన ఇద్దరు నిందితులు అరెస్ట్.

NAKSHATRAM, MEDCHAL
Published on: 21 April 2026 10:08 AM IST
Medchal
X

Medchal

Medchal: మేడ్చల్ జిల్లాలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రోల్డ్ గోల్డ్ గొలుసు దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి ఈ నెల 17న మజీద్‌పూర్ బస్ స్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉండగా, ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కొని పరారయ్యారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు దొంగిలించిన గొలుసును మేడ్చల్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించగా, అది రోల్డ్ గోల్డ్ అని తేలింది. దీంతో వారు ఆ గొలుసును తమ వద్దే ఉంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

తదుపరి దర్యాప్తులో నిందితులు షేక్ సగీర్ అహ్మద్, విభూతి సాయి కృష్ణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనలో బాధితురాలు ధరించిన గొలుసు అసలు బంగారం కాదని తేలడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story