Medchal: ప్రైవేట్ పాఠశాలల బంద్: ప్రిన్సిపాల్ రూపారెడ్డికి నివాళులు!
Medchal: ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా మేడ్చల్‌లో ప్రైవేటు పాఠశాలల బంద్, శాంతి ర్యాలీ. ఉపాధ్యాయుల భద్రతకు రక్షణ కల్పించాలని ట్రస్మా డిమాండ్.
Medchal: ప్రైవేట్ పాఠశాలల బంద్: ప్రిన్సిపాల్ రూపారెడ్డికి నివాళులు!
Medchal: నల్గొండ జిల్లాలో నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ మేడ్చల్‌లో ప్రైవేటు పాఠశాలల యజమానుల సంఘం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, పాఠశాలల బంద్ నిర్వహించారు.
స్వామి వివేకానంద, అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి రూపారెడ్డికి నివాళులర్పించారు.
పిల్లలకు స్మార్ట్‌ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని, పిల్లల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలని నిర్వాహకులు సూచించారు. అలాగే ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని, ప్రత్యేక సిబ్బందితో విద్యార్థుల ప్రవర్తనపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కోరారు. రూపారెడ్డి హత్యపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో యూనియన్ ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




