Medchal: బీఆర్‌ఎస్‌లో చేరిన బాసుపల్లి రాంరెడ్డి.. ఆహ్వానించిన మల్లారెడ్డి

Medchal: మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో పూడూరు కిష్టాపూర్ సీనియర్ నేత బాసుపల్లి రాంరెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 15 Oct 2026 4:16 PM IST
Medchal
X

Medchal: బీఆర్‌ఎస్‌లో చేరిన బాసుపల్లి రాంరెడ్డి.. ఆహ్వానించిన మల్లారెడ్డి

Medchal: మేడ్చల్ సర్కిల్ లోని పూడూరు కిష్టాపూర్ 298 డివిజన్ కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బాసుపల్లి రామ్ రెడ్డి గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు.

పూడూరు కు చెందిన రామ్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి గురువారం ఉదయం బోయిన్పల్లి లోని ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసానికి వెళ్లగా ఆయనను ఎమ్మెల్యే సాగరంగా స్వాగతం పలికి గులాబీ కండువా కప్పారు.

రాబోయే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూడూర్ కిష్టాపూర్ డివిజన్లో గులాబీ జెండా ఎగరవేయడానికి కృషి చేయాలని అన్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో మూడు డివిజన్లలో బి ఆర్ఎస్ పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తానని ఈ సందర్భంగా రామ్ రెడ్డి ఆన్నారు.

పార్టీలో చేరిన అనంతరం రామ్ రెడ్డి తన అనుచరులతో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

కార్యక్రమంలో నాయకులు, రాంరెడ్డి అనుచరులు పాల్గొన్నారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL