Medchal: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసుల దాడి!
Medchal: మేడ్చల్ అత్వెళ్లిలోని ఏ1 అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై ఎస్ఓటీ దాడులు. నాసిరకం పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం గుర్తింపు, నిర్వాహకులపై కేసు నమోదు.
Medchal: కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసుల దాడి!
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్వెళ్లి ప్రాంతంలో ఉన్న ఏ1 అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పేస్ట్ తయారీలో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
అపరిశుభ్రమైన వాతావరణంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు, నాసిరకమైన ముడిసరుకును వినియోగాన్ని గుర్తించినట్లు తెలిసింది. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉండగా, వాటి ఉల్లంఘనలకు సంబంధించి అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై తయారీ కేంద్రం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా సంబంధిత ఆహార భద్రతా అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంద పలువురు అంటున్నారు. తయారైన పేస్ట్ నిల్వలు, విక్రయాలు, సరఫరా చేసిన ప్రాంతాలపై కూడా అధికారులు దృష్టి సారించి ప్రజల ఆరోగ్య భద్రతకు భంగం వాటిల్లకుండా చూడాలని కోరుతున్నారు.




