Medchal: నిజాయితీ చాటుకున్న మేడ్చల్ డిపో టీజీఎస్‌ఆర్టీసీ సిబ్బంది!

Medchal: మేడ్చల్ TGSRTC సిబ్బంది నిజాయితీ: ప్యాట్ని వద్ద ప్రయాణికుడు మరిచిపోయిన రూ.2 లక్షల నగదు ఆపిల్ ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను బాధితుడికి భద్రంగా అప్పగించారు.

NAKSHATRAM, MEDCHAL
Updated on: 9 Aug 2026 3:12 PM IST
Medchal
X

Medchal: నిజాయితీ చాటుకున్న మేడ్చల్ డిపో టీజీఎస్‌ఆర్టీసీ సిబ్బంది!

Medchal: ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను గుర్తించి సురక్షితంగా తిరిగి అప్పగించి మేడ్చల్ టీజీఎస్‌ఆర్టీసీ డిపో సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. శనివారం మేడ్చల్ డిపోకు చెందిన 215/2 సర్వీస్ బస్సు పటాన్‌చెరువు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తుండగా కేపీహెచ్‌బీ వద్ద ప్రశాంత్ అనే ప్రయాణికుడు బ్యాగ్‌తో బస్సు ఎక్కి, రాత్రి 1.15 గంటలకు ప్యాట్ని వద్ద దిగిపోయారు.

అనంతరం బస్సు తిరుగు ప్రయాణంలో ఉండగా కండక్టర్ గోవింద్ బ్యాగ్‌ను గుర్తించి డిపో అసిస్టెంట్ మేనేజర్ CI జి. రామారావు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. బ్యాగ్‌లో సుమారు రూ.2 లక్షల నగదు, ఆపిల్ ల్యాప్‌టాప్, రెండు పర్సులు, చార్జర్, దుస్తులు, ఆఫీస్ ఐడీ కార్డు తదితర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగ్‌లోని కాంటాక్ట్ నంబర్ ద్వారా ప్రశాంత్‌ను సంప్రదించి, డిపోకు పిలిపించి అతని సమక్షంలో వస్తువులన్నింటినీ పరిశీలించి సురక్షితంగా తిరిగి అప్పగించారు. దీంతో ప్రయాణికుడు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story