Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జ్యువెలరీ షాపులో భారీ చోరీ!
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జగదాంబ జ్యువెలరీ షాపులో దొంగతనం. వెనుక గోడకు కన్నం వేసి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు. కలకలంలో వ్యాపారులు.
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జ్యువెలరీ షాపులో భారీ చోరీ!
Medchal: పోలీస్ స్టేషన్‌కు పక్కన ఉన్న ఓ జగదాంబ నగల దుకాణంలో దుండగులు బరితెగించి చోరీకి పాల్పడ్డారు. వెనుక వైపు గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి విలువైన వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న 'శ్రీ జగదాంబ జ్యువెలర్స్' దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడ్డారు.
దుకాణం వెనుక భాగంలో ఉన్న గది గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. దుకాణంలో భద్రపరిచిన వెండి వస్తువులను అపహరించుకుపోయారు. ఉదయం దుకాణ యజమాని శేషమాల్ చౌదరి కుమారుడు అజయ్ చౌదరి దుకాణం తెరిచి చూడగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దుకాణంలో ఉన్న వెండి సామగ్రి చోరీకి గురైనట్లు యజమాని శేషమల్ చౌదరి తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.
రెండోసారి చోరీ
పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నప్పటికీ, ఇదే జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలో చోరీ జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ఘటనే జరగడం, మళ్లీ ఇప్పుడు అదే రీతిలో వెనుక గోడకు రంధ్రం వేసి చోరీకి పాల్పడటంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.




