Jawaharnagar: ఫోర్జరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన జవహర్‌నగర్ పోలీసులు

Jawaharnagar: జవహర్‌నగర్‌లో ఫోర్జరీ కేసులో ముగ్గురు అరెస్ట్. అమెరికాలో ఉన్న యజమానికి బదులుగా నకిలీ మహిళను సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన నిందితులు.

PURENDAR, ALWAL
Published on: 24 Sept 2026 8:23 PM IST
Jawaharnagar
X

Jawaharnagar: ఫోర్జరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన జవహర్‌నగర్ పోలీసులు

జవహర్‌నగర్: ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫోర్జరీ కేసులో ముగ్గురు నిందితులను జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణారెడ్డి నగర్ కాలనీలోని ప్లాట్లు నంబర్లు 167, 168కు సంబంధించి అసలు యజమాని మానసారావు అమెరికాలో ఉన్న సమయంలో, మరో మహిళను ఆమెగా చూపించి కాప్రా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఫోర్జరీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో A-1 అరవింద్ అలియాస్ టిల్లు, A-3 భాస్కర్ గౌడ్, A-4 సూరిబాబులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ఒరిజినల్ టైటిల్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో సుమారు రూ.62.13 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు, వారి కోసం గాలింపు కొనసాగుతోందని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL