Hyderabad: హబ్సిగూడలో మెడికల్ షాపుల బంద్ రోడ్డుపైకి వచ్చిన కెమిస్టులు!
Hyderabad: ఆన్‌లైన్ మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని హబ్సిగూడ, నాచారం, తార్నాక ప్రాంతాల్లో మెడికల్ షాపులు బంద్ అయ్యాయి.
Hyderabad: హబ్సిగూడలో మెడికల్ షాపుల బంద్ రోడ్డుపైకి వచ్చిన కెమిస్టులు!
హైదరాబాద్: ఆన్లైన్ మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ, కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపునిచ్చిన నేపధ్యంలో హబ్సిగూడ, నాచారం, తార్నాక ప్రాంతాలలో మెడికల్ షాప్ ల బంద్ కొనసాగుతోంది. హబ్సిగూడ - నాచారం కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాప్ ల నిర్వహుకులు హబ్సిగూడ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం హబ్సిగూడ, నాచారం ప్రాంతాల్లో ఓపెన్ చేసి ఉంచిన మెడికల్ షాప్ వద్ద నిరసన వ్యక్తం చేసి షాప్ లను బంద్ చేయించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు, రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ లు మాట్లాడుతూ ఆన్లైన్ ఫార్మసీలు ఎటువంటి భౌతిక పరిశీలన లేకుండా, నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యాంటీబయాటిక్స్, మత్తు కలిగించే ప్రమాదకరమైన మందులను విక్రయిస్తూ ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఆరోపించారు.
కరోనా మహమ్మారి సమయంలో మందులను హోమ్ డెలివరీ కోసం కేంద్రం తాత్కాలికంగా తెచ్చిన ఆన్ లైన్ డెలివరీ మినహాయింపు ఇప్పటికీ కొనసాగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మందుల ను విక్రయించకుండా కొన్ని ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ చిన్న వ్యాపారుల పొట్టకొడుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలో మార్పులు తీసుకురావాలని కోరారు.




