Medchal: మేడ్చల్ మెడిసిటి కాలేజీకి ప్రతిష్టాత్మక NABH గుర్తింపు!
Medchal: మేడ్చల్ జిల్లా ఘన్పూర్ మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన కేంద్ర ప్రభుత్వ NABH గుర్తింపు సాధించింది.
Medchal: మేడ్చల్ మెడిసిటి కాలేజీకి ప్రతిష్టాత్మక NABH గుర్తింపు!
Medchal: తెలంగాణాలో NABH గుర్తింపు సాధించిన అతి కొద్ది టీచింగ్ హాస్పిటల్స్ లో ఒకటిగా ఘనత సాధించిన
మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఘన్ పూర్, మేడ్చల్.
మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఘన్ పూర్, మేడ్చల్ నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా మరో మైలు రాయి సాధించింది. భారత దేశంలో వైద్య సేవలలో నాణ్యతను పరీక్షించి సర్టిఫికేట్ అందించే NABH గుర్తింపును మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సాధించింది. తెలంగాణాలో ఉన్న మెడికల్ కాలేజీ అనుబంధ హాస్పిటల్స్ లో ఇలా NABH గుర్తింపు సాధించిన అతి కొద్ది సంస్థలలో మెడిసిటి ఒకటిగా నిలుస్తుంది. ఇలా NABH అక్రిడేషన్ అనగా గుర్తింపు పై వివరాలను నేటి ఉదయం మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ లో జరిగిన విలేఖరుల ప్రత్యేక సమవేశంలో సంస్థ యాజమాన్యం వెల్లడించింది.
ముందుగా శ్రీ ఐనిష్ మర్చంట్, CEO, మెడిసిటి గ్రూపు ఆఫ్ హాస్పిటల్స్ వారు మాట్లాడుతూ వైద్య సేవలలో నాణ్యత అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అన్నారు. ఈ దిశగా నేడు మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ కు చెందిన అనుబంధ మెడిసిటి హాస్పిటల్ కు NABH అక్రిడేషన్ కోసం పట్టుదలతో పని చేసి గుర్తింపు సాధించామని ప్రకటించారు. ఈ గుర్తింపు గత కొన్ని సంవత్సరములుగా వైద్య సేవలలో నాణ్యతను పెంపొందించడానికి సంస్థ చేస్తున్న కృషికి నిదర్శనమన్నారు.
అనంతరం ప్రొఫెసర్ కె శివరామకృష్ణ, ప్రెసిడెంట్ మాట్లాడుతూ మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను 1980 లలో స్థాపించిన నాటి నుండి ఎన్నో అరుదైన ఘనతలను స్వంతం చేసుకొంటూ వచ్చిందన్నారు. 1993 లో హైదరాబాదు నగరంలో గుండెకు బైపాస్ శస్త్ర చికిత్సలు చేయడంతో పాటూ స్టెంట్ వేసే చికిత్సను అందుబాటులోనికి తెచ్చింది మెడిసిటి హాస్పిటల్స్ అని వెల్లడించారు. లాభాపేక్ష లేకుండా 1990 ల ప్రాంతంలో అమెరికాలో పని చేస్తున్న వైద్యుల ద్వారా స్థాపించిన సంస్థ నేడు దిన దినాభివృద్ది చెందుతూ రోగులకు నాణ్యమైన సేవలతో పాటూ అత్యాధునిక చికిత్స అందించడంలో పేరు గడిస్తోందని వివరించారు. దీనికి కొనసాగింపుగా ఇపుడు NABH అక్రిడేషన్ సాధించి మరో మారు తాను చేస్తున్న సేవలు నాణ్య౦.




