Medipally: మెడకు చుట్టుకున్న ఇంటర్నెట్ కేబుల్.. తీవ్ర గాయాలు

Medipally: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ద్వారకానగర్ కాలనీలో రోడ్డుపై నిర్లక్ష్యంగా వేలాడుతున్న ఇంటర్నెట్ కేబుల్ మెడకు చుట్టుకుని ఓ స్కూటీదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

KARUNAKAR, UPPAL
Published on: 11 Jun 2026 9:00 PM IST
Medipally
X

Medipally: మెడకు చుట్టుకున్న ఇంటర్నెట్ కేబుల్.. తీవ్ర గాయాలు

Medipally: రోడ్డుపై నిర్లక్ష్యంగా వేలాడదీసిన ఇంటర్నెట్ కేబుల్‌ కారణంగా ఓ వ్యక్తి ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పీర్జాదిగూడకు చెందిన ఎండ్ల మనోహర్ (53) జూన్ 5న చెంగిచెర్ల ద్వారకానగర్ కాలనీ సమీపంలో స్కూటీపై వెళ్తుండగా, రోడ్డుపై వేలాడుతున్న ఇంటర్నెట్ కేబుల్ అకస్మాత్తుగా అతని మెడకు చుట్టుకుంది.

దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆయన వాహనాన్ని ఆపే ప్రయత్నంలో రోడ్డుపక్కన ఉన్న ఇటుకలపై కాలు పెట్టి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఎడమ కాలి మడమకు ఫ్రాక్చర్ అయింది. ప్రమాదం అనంతరం అక్కడికి వచ్చిన కేబుల్ ఏర్పాటు సిబ్బందిని బాధితుడు ప్రశ్నించగా,

వారి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించాడు. రోడ్డుపై కేబుల్‌ను నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్ల తనతో పాటు ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story