Medipally: మేడిపల్లిలో దొంగతనం కాశీ యాత్రకు వెళ్లిన ఇంటిలో చోరీ
Medipally: కాశీ యాత్రకు వెళ్లిన కుటుంబం ఇంట్లో తాళాలు పగులగొట్టి 40 తులాల వెండి, నగదు, డాలర్లు అపహరించిన దొంగ. మేడిపల్లి పీఎస్‌లో కేసు నమోదు.
Medipally: మేడిపల్లిలో దొంగతనం కాశీ యాత్రకు వెళ్లిన ఇంటిలో చోరీ
మేడిపల్లి: కాశీ యాత్రకు వెళ్లిన ఓ కుటుంబం ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. ఇంటి ప్రధాన ద్వారం, బీరువా తాళాలు పగులగొట్టి సుమారు 40 తులాల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు, 600 డాలర్లు అపహరించాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి పీర్జాదిగూడలో శనివారం వెలుగులోకి వచ్చింది.
పీర్జాదిగూడలోని హరిణి మ్యాన్షన్‌లో రామిని నాగరాజు కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 4న ఉదయం 7 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లారు. శనివారం ఉదయం 5.40 గంటలకు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించిన పొరుగువారు నాగరాజుకు సమాచారం అందించారు.
దీంతో ఆయన సోదరుడు రామిని విద్యాసాగర్ కు విషయం తెలియచేయగా, ఇంటికి చేరుకుని పరిశీలించారు. ప్రధాన ద్వారంతో పాటు బెడ్‌రూమ్‌లోని బీరువా తాళాలు కూడా పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలోని పసుపు కుంకుమ భరిణ, ఐదు చిన్న గిన్నెలు, రెండు ప్లేట్లు, సుమారు 40 తులాల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు, 600 డాలర్లు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించారు.
ఇంట్లోకి నిందితుడు ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడింది ఒక్కరేనా? మరెవరైనా సహకరించారా? అనే కోణంలో క్లూస్ టీం, సాంకేతిక ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




