Medipally: మేడిపల్లి ఓటరు జాబితా సవరణపై జక్క వెంకట్ రెడ్డి సమీక్ష
Medipally: మేడిపల్లి, పీర్జాదిగూడల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సమీక్ష. అర్హులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపు.
Medipally: మేడిపల్లి ఓటరు జాబితా సవరణపై జక్క వెంకట్ రెడ్డి సమీక్ష
మేడిపల్లి: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ వార్డుల్లో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సమీక్షించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, దరఖాస్తుల పరిశీలన, డిక్లరేషన్‌ల స్వీకరణ తదితర అంశాలపై బూత్ లెవల్ అధికారులు (BLOలు), బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో సమావేశమై సమగ్రంగా చర్చించారు.
అనంతరం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగవ డివిజన్ మాజీ అధ్యక్షుడు యాసారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్వతాపూర్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన SIR నమోదు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాలంటీర్లతో కలిసి ప్రజలకు దరఖాస్తు ఫారాలు నింపించి, అవసరమైన వివరాలను నమోదు చేయడంలో సహకరించారు. ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు.
అర్హత కలిగిన ప్రతి పౌరుడు SIR ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని, నిర్ణీత గడువులోగా డిక్లరేషన్ సమర్పించాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే ఓటరు జాబితాలో పేరు తొలగిపోయే అవకాశం ఉండవచ్చని పేర్కొంటూ, ఎలాంటి సందేహాలు ఉన్నా BLOలను సంప్రదించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.
ప్రజలు చివరి రోజు వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తులు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్, కొల్తూరి మహేష్, బీఆర్ఎస్ మాజీ జనరల్ సెక్రటరీ ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షులు కోనేటి వెంకట్, మునికుంట్ల కిరణ్ గౌడ్, 3వ డివిజన్ మాజీ జనరల్ సెక్రటరీ పింగళి జోగిరెడ్డి, పార్టీ నాయకులు సతీష్, అమర్ పటేల్, లారెన్స్, సురేష్, కిషోర్, జోగిరెడ్డి, బి. మహేష్, రఘు, బి. శివ, లింగస్వామి, వై. ప్రభాకర్, రాజు, రాజీవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




