Medipally: మేడిపల్లిలో విషాదం ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
Medipally: మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో విషపదార్థం సేవించి కారులో మృతి చెందిన ప్రైవేట్ ఉద్యోగి అంబటి రమేష్.
Medipally: మేడిపల్లిలో విషాదం ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
మేడిపల్లి: ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి విషపదార్థం సేవించి కారులో మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చెంగిచెర్లకు చెందిన అంబటి రమేష్ (47) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 6న రాత్రి 8 గంటల సమయంలో కారులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇక బతకాలని అనిపించడం లేదని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో శనివారం ఉదయం కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెర్లపల్లి ప్రధాన రహదారిపై కారులో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మృతుడు మిస్సింగ్ అయిన అంబటి రమేష్‌గా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా గుర్తుతెలియని విషపదార్థం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




