Medipally: చోరీ కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Medipally: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ ఎస్‌బీఆర్ కాలనీలో చోరీ కేసును ఛేదించి, నిందితుడు మాలోతు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి 4.4 తులాల బంగారం స్వాధీనం.
Medipally: చోరీ కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులు.. నిందితుడి అరెస్ట్
మేడిపల్లి: ఇంట్లో చోరీకి పాల్పడి నగలు, విలువైన వస్తువులు అపహరించిన నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 4.4 తులాల బంగారం, 25 తులాల వెండి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ ఎస్‌బీఆర్ కాలనీలో నివాసముండే రవీంద్రచారి ఇంట్లో ఈ నెల 8న చోరీ జరిగింది.
బాధితుడి ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన మాలోతు ప్రశాంత్ (25) ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించి అరెస్టు చేశారు.
నిందితుడి నేర చరిత్రను పరిశీలించగా.. 2023లో ఇల్లెందు పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ అతడిపై కేసు నమోదైనట్లు గుర్తించారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్‌ఐ బోలిశెట్టి శ్రీను, హెచ్‌సీ రాము, పీసీలు మహిపాల్, హరిబాబులను మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ జలంధర్‌రెడ్డి అభినందించారు.




