Medipally: భద్రతలో ‘సహచరి’ల భాగస్వామ్యం మేడిపల్లి పోలీసులు

Medipally: మేడిపల్లిలో స్వయం సహాయక సంఘాల మహిళలతో పోలీసుల అవగాహన సమావేశం. నేరాల నియంత్రణ, సైబర్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఎస్एचओ జలేంధర్ రెడ్డి సూచన.

KARUNAKAR, UPPAL
Published on: 7 Aug 2026 5:59 PM IST
Medipally
X

Medipally: భద్రతలో ‘సహచరి’ల భాగస్వామ్యం మేడిపల్లి పోలీసులు

మేడిపల్లి: నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్‌ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని మేడిపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జలేంధర్‌ రెడ్డి అన్నారు. ‘మీ సురక్ష సహచరి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళల భద్రత, రహదారి భద్రత, నేరాల నివారణ, సైబర్‌ నేరాలపై అప్రమత్తత, కమ్యూనిటీ పోలీసింగ్‌ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

పోలీసులు–ప్రజల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు కీలకపాత్ర పోషించాలని జలేంధర్‌ రెడ్డి కోరారు. ప్రతి సభ్యురాలు ‘కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్‌’గా వ్యవహరిస్తూ మహిళలు, ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లావాదేవీలు, మోసాలు లేదా ఇతర నేరాల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. సమావేశంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొని పలు అంశాలపై పోలీసులతో చర్చించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story