Medipally: మేడిపల్లిలో అక్రమ కారా తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ దాడి
Medipally: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్లలో సింథటిక్ రంగులతో కారా పదార్థాలు తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్‌ఓటీ దాడి. నిర్వాహకుడు అరెస్ట్.
Medipally: మేడిపల్లిలో అక్రమ కారా తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ దాడి
మేడిపల్లి: ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగించి అపరిశుభ్ర పరిస్థితుల్లో కారా పదార్థాలు తయారు చేస్తున్న కేంద్రంపై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్లలోని శ్రీమాత అరవింద కాలనీలో ఉన్న ఎస్‌వీఎస్ కారా తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి 30 కిలోల అప్పడాలు, 30 కిలోల మురుకులు, రెండు సింథటిక్ ఫుడ్ కలర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కారా తయారీ వ్యాపారం చేస్తున్న తంబిదురై విష్ణు (28)ను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అప్పడాలు, మురుకులతో పాటు నిందితుడిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.
ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా సింథటిక్ రంగులు ఉపయోగించి కారా పదార్థాలు తయారు చేసి సమీపంలోని హాట్‌చిప్స్ దుకాణాలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న వస్తువులను పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. నిందితుడిపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.




