Medipally: బీఎల్‌ఓల సమావేశం మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు!

Medipally: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌ఓలతో సమావేశం నిర్వహించి, ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

KARUNAKAR, UPPAL
Published on: 26 Aug 2026 8:29 AM IST
Medipally
X

Medipally: బీఎల్‌ఓల సమావేశం మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు!

Medipally: 2002 ఓటర్ల జాబితాలో మ్యాపింగ్‌ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసి, అవసరమైన పత్రాలు సమర్పించేలా అవగాహన కల్పించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి తహసీల్దార్‌ వెంకట నర్సింహారెడ్డి బీఎల్‌ఓలను ఆదేశించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై బీఎల్‌ఓలకు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులు సంబంధిత ఫారం ద్వారా నమోదు చేసుకునేలా ప్రజలకు తెలియజేయాలన్నారు.

ఓటరు జాబితాలో పేరు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, చేర్పులు, సవరణలకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకునే విషయాన్ని వివరించాలని సూచించారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాలు ఉన్న ఓటర్లు ఈ నెల 27న నిర్వహించే గ్రామసభలో వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా పూర్తి చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story