Medipally: జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడికి తుంగతుర్తి రవి అభినందనలు
Medipally: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మకు శ్రీనివాస్‌ను మేడిపల్లి డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి కలిసి అభినందనలు తెలిపారు.
Medipally: జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడికి తుంగతుర్తి రవి అభినందనలు
మేడిపల్లి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మకు శ్రీనివాస్‌కు మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అభినందనలు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పట్ల అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరింత చేరువ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. జిల్లా స్థాయిలో అప్పగించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయాలని కోరారు.
ఈ బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మక్ కళ్యాణ్, చెంగిచర్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, లోకేష్ తదితరులు పాల్గొని బొమ్మకు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.




