Medipally: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి తుంగతుర్తి రవి

Medipally: మేడిపల్లి పర్వతాపూర్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించాలని పిలుపు.

KARUNAKAR, UPPAL
Published on: 22 July 2026 9:20 PM IST
Medipally
X

Medipally: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి తుంగతుర్తి రవి

మేడిపల్లి: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే మూలస్తంభమని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి సూచించారు.

మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ పర్వతాపూర్‌లో కొనసాగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్‌లలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్‌ల పనితీరు, ఓటర్లకు అందిస్తున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సవరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి, అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ, ప్రతి పౌరుడు సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో ముదిగొండ రమేష్, యాసారం నాగేష్, సుదర్శన్ రెడ్డి, ఉదయ్ రాజ్ గౌడ్, కృష్ణ, అజయ్ రెడ్డి, సాయిరాం గౌడ్, బద్దం సాయిరాం రెడ్డి, నటరాజ్, ప్రణయ్, ఏఎంసీ శ్యామ్ సుందర్ రావు, ఆర్వో శ్రీనివాస్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story