Medipally: ఏఈ సత్యనారాయణ రెడ్డికి డీఈగా పదోన్నతి - ఘనంగా వీడ్కోలు సభ!

Medipally: మేడిపల్లి ఏఈ సత్యనారాయణ రెడ్డికి డీఈగా పదోన్నతి. మోత్కూర్‌కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా డివిజన్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల ఘన సత్కారం.

KARUNAKAR, UPPAL
Published on: 4 Nov 2026 2:42 PM IST
Medipally
X

Medipally: విధి నిర్వహణలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అధికారి సత్యనారాయణ రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో విద్యుత్‌ శాఖ సహాయ ఇంజినీర్‌ (ఏఈ)గా పనిచేసిన ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (డీఈ)గా పదోన్నతి పొందారు.

ఈ క్రమంలో మోత్కూర్‌కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా బుధవారం డివిజనల్‌ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మేడిపల్లి డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండి శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో పనిచేసిన కాలంలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేశారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. పదోన్నతితో కొత్త బాధ్యతలు చేపడుతున్న ఆయన మోత్కూర్‌లోనూ ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి జలేందర్‌ రెడ్డి, జంగచారి, రంజిత్‌ రెడ్డి, యాసారం నాగేష్‌, సుదర్శన్‌ రెడ్డి, మహ్మద్‌ మజర్‌, చింతల నర్సింహారెడ్డి, రాజరాజు, మోహన్‌ కుమార్‌, ఇర్ఫాన్‌, నాగరాజు, మణిరం నాయక్‌, జయందర్‌, ఐలయ్య యాదవ్‌, సోమయ్య, కపిల్‌, శేఖర్‌, ఖాజా, హైదర్‌, శ్రీకాంత్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL