Rangareddy: తండ్రి మిస్సింగ్.. తట్టుకోలేక పెట్రోల్ పోసుకుని కుమారుడు ఆత్మహత్య!

Rangareddy: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.

RAHUL, MEERPET
Published on: 12 May 2026 8:42 AM IST
Rangareddy
X

Rangareddy: తండ్రి మిస్సింగ్.. తట్టుకోలేక పెట్రోల్ పోసుకుని కుమారుడు ఆత్మహత్య!

రంగారెడ్డి జిల్లా: తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి తానే కారణమని తీవ్ర మనస్తాపానికి గురైన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన బుయ్యకర్ చంద్రశేఖర రావు(25) తన తండ్రి రవీందర్ తో గొడవపడ్డాడు. ఈ గొడవ అనంతరం తండ్రి రవీందర్ గత నెల ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆయన ఆచూకీ లభించకపోవడంతో కేశంపేట పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

కుటుంబ సభ్యుల మందలింపుతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ నెల 1వ తేదీన ఇంటి నుంచి వెళ్లి హైదరాబాద్ కర్మాన్‌ఘాట్‌లో అద్దె గదిలో నివసిస్తున్నాడు.

తండ్రి తిరిగి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కుమారు మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బడంగ్‌పేట్ ప్రధాన రహదారి పక్కన ఉన్న వైన్ షాప్ వెనుక నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న మీర్‌పేట్ పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story