Pargi: పరిగిలో డీఏపీ ఎరువుల కొరతపై బీఆర్ఎస్ సమరశంఖం..

Pargi: పరిగిలో డీఏపీ ఎరువుల కొరత, నకిలీ ఎరువుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ అధికారి, ఎస్‌ఐలకు వినతిపత్రం అందజేశారు.

WAZID, PARIGI
Published on: 29 July 2026 11:53 PM IST
Pargi
X

Pargi: పరిగిలో డీఏపీ ఎరువుల కొరతపై బీఆర్ఎస్ సమరశంఖం..

పరిగి: పరిగి పట్టణంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ అధికారి, పరిగి ఎస్‌ఐలకు వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన డీఏపీ ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందుబాటులో ఉంచడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

నకిలీ ఎరువుల వల్ల పంటల దిగుబడి తగ్గి రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నకిలీ ఎరువుల తయారీ, నిల్వ, విక్రయాల్లో పాల్గొంటున్న వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యపై స్పందించకపోవడం బాధాకరమని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. వ్యవసాయ శాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నకిలీ ఎరువుల విక్రయాలను అరికట్టాలని కోరారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నాణ్యమైన డీఏపీ ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు, నకిలీ ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story